కరోనా వైరస్ దెబ్బకి గత మూడు నెలల నుంచి ఆటోమొబైల్ రంగం పూర్తిగా దెబ్బతింది.ఇకపోతే తాజాగా చైనాతో జరుగుతున్న అంతర్యుద్ధంతో కూడా మరింత సతమతమవుతోంది ఆటోమొబైల్ రంగం. దీంతో ఆటో రంగ పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారయింది. దీంతోపాటు టూవీలర్, కార్ల విక్రయాలు పూర్తిగా అడుగంటి పోయాయి. చాలా కంపెనీలు వారి కొత్త ఉత్పాదక మోటార్ సైకిల్ కార్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు జంకుతున్నాయి. వాస్తవానికి మార్చి నెలలో విడుదల కావాల్సిన చాలా మోడల్స్ జూన్ నెలలో లాంచ్ చేద్దామని ప్లాన్ వేసుకున్నాయి వాహన సంస్థలు. 

 


కాకపోతే ప్రస్తుతం కరోనా ప్రభావంతో ఈ వాహనాలను మరింత వాయిదా వేస్తూ వేస్తున్నాయి సదరు కంపెనీలు. ఇకపోతే ప్రస్తుత సమాచారం వరకు వచ్చే నెలలో భారత మార్కెట్లో కొన్ని ప్రముఖ ఆటోమొబైల్ సంస్థల నుండి బైక్స్ భారత మార్కెట్లోకి రాబోతున్నాయి. ఇక వాటి విషయానికి వస్తే హీరో సంస్థ నుండి ఎక్స్ట్రీమ్ 160 ఆర్ బైక్ విడుదల కానుంది. ఈ బైకులు 160cc సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజన్ ను కంపెనీ అమర్చింది. అంతేకాకుండా ఈ బైక్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ బైక్ కేవలం 4.5 సెకన్లలోనే 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక మరో బైక్ హోండా లివో 110. ఈ బైక్ ను తాజాగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన బిఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా కొన్ని మార్పులు చేసి 110 సిసి ఇంజన్ తో బైకును రిలీజ్ చేయబోతున్నారు. అలాగే టీవీఎస్ సంస్థ నుండి టీవీఎస్ స్కూటీ జస్ట్ 100 బైక్ కూడా వచ్చే నెలలో మార్కెట్లోకి రానుంది. ఈ బైకులు 110 సిసి ఇంజన్ ను కలిగి ఉంది. క్రితం మోడల్ తో పోలిస్తే ఈ మోడల్ కు ధర ఐదు నుంచి ఏడు వేలు పెరిగే అవకాశం ఉంది.

 


ఇక అందరూ ఎదురు చూసే రాయల్ ఎన్ఫీల్డ్ మిటియర్ 350 మోటార్ బైక్ 346 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ను కలిగి ఉండి 19.8 bhp బ్రేక్ అలాగే 28 nm ఉత్పత్తి చేయగలుగుతుంది. ఇక దీని ఖరీదు మార్కెట్లో 1.6 లక్షల నుండి 1.7 లక్షల మధ్యలో ఉండే అవకాశం ఉంది. హీరో సంస్థ నుండి మరో బైక్ హీరో x పల్స్ 200 కూడా అ రిలీజ్ కాబోతోంది. ఈ బైక్ కూడా bs6 మార్పులతో మార్కెట్ లోకి రిలీజ్ కాబోతోంది. బైకు ధర మార్కెట్ లో 1.17 లక్షలు గా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: