ఈ ఎలక్ట్రికల్ స్కూటర్ పిల్లలకు కూడా మంచి అనుభవాన్ని అందించబడుతుంది. ఈ స్కూటర్ చిన్న దూరాలకు ఎంతగానో ఉపయోగపడుతుందని అలాగే సురక్షితంగా ప్రయాణించడానికి సహకరిస్తుందని కంపెనీ యాజమాన్యం తెలియజేస్తుంది. అయితే ఈ స్కూటర్ కేవలం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించగలవు. ముఖ్యంగా వీటిని మహిళలు ఇంట్లో ఉండే మధ్య వయసు పిల్లలు కూడా బయటికి వెళ్లడానికి ఎంత గానో సౌకర్యవంతంగా ఉంటాయి అని తెలియజేస్తున్నారు. అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒకినవ ఆర్ 30 మోడల్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇక ఈ స్కూటర్ లో బ్యాటరీ 1.5 కిలో వాట్స్ లిథియం అయాన్ బ్యాటరీ తీసి పెట్టుకునే విధంగా ఉంటుంది. 5 amp ద్వారా మన ఇంట్లో ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ఇక ఈ స్కూటర్ డిజైన్ విషయానికొస్తే పెరల్ వైట్, సన్ రైస్ ఎల్లో, సి గ్రీన్, మెటాలిక్ ఆరెంజ్, గ్లోసి రెడ్ లాంటి మొత్తం ఐదు రంగులలో ఈ స్కూటర్ లభించబోతోంది.ఈ స్కూటర్ కి మరింత అందాన్ని చేకూర్చేందుకు స్టైలిష్ అల్యూమినియం అల్లాయ్ వీల్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఈ స్కూటర్ ధర విషయానికి వస్తే.. షో రూమ్ లో రూ 58,992 రూపాయలు కంపెనీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇందులో మొత్తం మూడు సంవత్సరాల వారంటీతో మోటార్ సైకిల్ పై అలాగే బ్యాటరీ ని అందించబడుతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి