
ఇప్పటికే ఈ సమస్యను పరిష్కరించడానికి అనేక కంపెనీలు దాని మీద దృష్టి పెట్టాయి.తాజాగా అమెరికాకు చెందిన ఒక స్టార్ట్-అప్ కంపెనీ ఛార్జింగ్ అవసరం లేని ఒక కారును తయారు చేసింది. అది ఎలా అని అనుకుంటున్నారా? సూర్యశక్తి సహాయంతో బ్యాటరీ ఛార్జ్ అయ్యేలా కారును ఆప్టెరా అనే ఒక స్టార్ట్-అప్ రూపొందించింది..ఆప్టెరా పారాడిగ్మ్ అనేది సౌర ఎలక్ట్రిక్ కారు పేరు. దీని అతిపెద్ద లక్షణం ఏమిటంటే ఇది ఎప్పటికీ ఛార్జ్ పెట్టాల్సిన అవసరం లేదు. సౌర శక్తితో రహదారిపై బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మరో ప్రత్యేకత ఏంటంటే 3 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగంతో దూసుకు పోతుంది.
కంపెనీ వెల్లడించిన ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే..దీని గరిష్ట వేగం గంటకు 177 కిలోమీటర్లు. ఆప్టెరా పారాడిగ్మ్ కారు ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత ఈ కారు 1000 మైళ్ళు అంటే 1600 కిలోమీటర్లు నడపవచ్చు. ఆప్టెరా ఇటీవలే తన సోలార్ ఎలక్ట్రిక్ కారును ప్రీ-ఆర్డర్స్ పై అందిస్తుంది. ఈ కారు చూడటానికి ముంగిస ఆకారంలో ఉంది. దీనిలో ఇద్దరు కలిసి ప్రయాణించవచ్చు. గత సంవత్సరం ఈ కారును సేల్ కి తీసుకొచ్చినప్పుడు 8 రోజుల్లో మూడు వేలకు పైగా ఆర్డర్స్ లభించాయి. పారాడిగ్మ్ ధర 29,000 డాలర్లు కాగా, పారాడిగ్మ్ ప్లస్ ధర 46,900 గా ప్రకటించింది. ఇండియాలో కూడా ఇలాంటి కార్లు వస్తే బాగుండు.. భానుడి వేడితో ఎంతో మంది లబ్ది పొందుతారు..