బీజేపీ హిందూ భావజాలం ఎక్కువగా ఉండే పార్టీ అలాగే.. కాస్త బ్రాహ్మణానుకూల వాదన ఉంటుందన్న విమర్శ కూడా ఉంది. అందుకే.. కులపరమైన రిజర్వేషన్లు.. కులపరమైన జనాభా గణన వంటి డిమాండ్లకు బీజేపీ మద్దతు పెద్దగా ఉండదు. కానీ.. ఇప్పుడు బీహార్‌లో సీన్ మారింది.
బీహార్‌లో కుల ఆధారిత గణన కాకుండా కుల ఆధారిత లెక్కింపు జరిపేందుకు అక్కడి బీజేపీ అంగీకరించిందట. అందుకే.. ఇక కుల ఆధారిత లెక్కింపు జరపనున్నట్లు బీహార్‌ సీఎం నితీష్‌కుమార్‌ ప్రకటించారు.


బీహార్‌లో అఖిల పక్ష సమావేశం నిర్వహించిన తర్వాతే నితీష్‌ కుమార్‌ ఈ ప్రకటన చేయడం విశేషం. అంతే కాదు.. కుల ఆధారిత లెక్కింపునకు బీజేపీ సహా అన్నిపార్టీలు ఒప్పకున్నట్టు ఆయన తెలిపారు. అయితే.. కుల ఆధారిత గణనకు న్యాయపరమైన ఇబ్బందులు ఉన్నాయి. అందుకే బిహార్‌లో కులఆధారిత లెక్కింపు జరిపేందుకు అన్ని పార్టీల అంగీకారం ముందుగా తీసుకున్నారు. ఆ తర్వాత ఈ కుల ఆధారిత లెక్కింపు ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదం తీసుకుంటారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp