టీడీపీ నేత పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ వ్యవహారం ఇటీవల వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. ఆయన సెక్యూరిటీ గన్ మెన్‌ల విషయంలో ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని టీడీపీ విమర్శిస్తోంది. అసలే తనకు సెక్యూరిటీ పెంచాలి అని పయ్యావుల లేఖ రాస్తే.. ఉన్న భద్రత ను తొలగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

మరి జగన్‌ పయ్యావుల ను ఎందుకు టార్గెట్ చేస్తారంటారా.. అందుకు టీడీపీ ఓ వింత రీజన్ చెబుతోంది. వైసీపీ డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టుర‌ట్టు చేశార‌నే అక్క‌సుతో పీఏసీ చైర్మన్ ప‌య్యావుల కేశ‌వ్ గారి సెక్యూరిటీ తొల‌గించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇప్పటికే జ‌గ‌న్‌రెడ్డి ఆర్థిక ఉగ్రవాదాన్ని పయ్యావుల కేశవ్ గ‌ణాంకాలతో స‌హా వెల్లడిస్తున్నందువల్ల జగన్ ఆయన్ను టార్గెట్ చేశారని చెబుతున్నారు.  ఈ క‌క్షసాధింపుల‌తో వైసీపీ స‌ర్కారు వేల‌కోట్ల మాయం,  ఫోన్ల ట్యాపింగ్ నిజ‌మేన‌ని ఒప్పుకున్నట్టేనని చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: