ప్రస్తుతం పాలసీలు తీసుకునేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. మరీ ముఖ్యంగా కరోనా మహమ్మారి తరువాత నుంచి పాలసీల సంఖ్య బాగా పెరిగిపోయింది.అయితే పాలసీ తీసుకున్న సమయంలో కంపెనీ ఓ బాండ్‌ను జారీ చేస్తుంది.ఆ బాండ్ లో పాలసీదారుని పేరు, నామినీ పేరు, పాలసీ నంబర్‌ ఇంకా అలాగే పాలసీకి సంబంధించిన అన్ని వివరాలు కూడా ఉంటాయి. అయితే పాలసీ తీసుకున్న తర్వాత బాండ్‌ను చాలా జాగ్రత్తగా ఉంచుకోవడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ బాండ్‌ పోతే చాలా ఇబ్బందులు పడుతుంటారు. పాలసీ సమయంలో లోన్‌ పొందడం ఇంకా క్లెయిమ్‌ చేయడం లాంటి సయయంలో ఈ డాక్యుమెంటే చాలా మెయిన్. ఇక కొన్ని సందర్భాలలో కొన్ని పొరపాట్ల వల్ల పాలసీ డాక్యుమెంట్‌ పోతుంటుంది.ఏదైనా అగ్ని ప్రమాదంలో డాక్యుమెంట్‌ కాలిపోవడం, వరదల సమయంలో ఇంకా ఇతర కారణాల వల్లనో పాలసీకి సంబంధించి డాక్యుమెంట్‌ మిస్ అవుతూ ఉంటుంది. ఇక అలాంటి సమయంలో చాలా మంది ఏమవుతుందో అని బాగా టెన్షన్‌ పడుతుంటారు. రిలాక్స్.. ఒకవేళ ఇలా బాండ్‌ పోయినట్లయితే అసలు ఎలాంటి టెన్షన్‌ పడాల్సిన పని లేదులేదు. ఎల్‌ఐసీ ఆఫీస్ ని సంప్రదిస్తే డూప్లికేట్‌ బాండ్‌ను జారీ చేస్తుంది. మీ బాండ్‌ పోయినట్లయితే ముందుగా ఈ విషయాన్ని మీరు మీ ఏజెంట్‌కు తెలియజేయాలి. లేదంటే మీ బ్రాంచ్‌ను విజిట్ చేసి పాలసీ బాండ్‌ పోయిన విషయాన్ని వారికి తెలియజేయాలి.


ఇక డూప్లికేట్‌ బాండ్‌ అయినా కూడా ఆ బాండ్ ఒరిజినల్‌గానే పని చేస్తుంది. మీ lic పాలసీ డాక్యుమెంట్‌ పోయినట్లయితే ఎల్‌ఐసీ బ్రాంచ్‌ను విజిట్ చేసి డూప్లికేట్‌ బాండ్‌ కోసం ప్రీమియం చెల్లింపులకు సంబంధించి పాత రశీదులను ఇవ్వండి. ఆ పాలసీ విలువను బట్టి స్టాంప్‌ డ్యూటీ చెల్లించి ఇండెమ్నిటీ బాండ్‌ను మీరు నోటరీ చేయించాలి. ఫోటో ఐడెంటిటీ కింద పాస్‌పోర్ట్‌, పాన్‌కార్డు, ఓటర్‌ ఐడీ ఇంకా అలాగే డ్రైవింగ్‌ లైసెన్స్‌ వంటి ఏదైనా గుర్తింపు కార్డును సమర్పించాల్సి ఉంటుంది. రెసిడెన్సీ ఫ్రూఫ్ కింద టెలిఫోన్‌ నంబర్‌ బిల్లు, బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్‌, ఎలక్ట్రిసిటీ బిల్లు ఇంకా అలాగే రేషన్‌కార్డు వంటి ఐడెంటిటీ డాక్యుమెంట్స్ ని అందించాల్సి ఉంటుంది.ఇక బ్రాంచ్‌ కౌంటర్‌లో పాలసీ ప్రిపరేషన్‌ ఛార్జీల కింద కొంత ఛార్జీ కనుక మీరు చెల్లిస్తే మీకు డూప్లికేట్‌ బాండ్‌ను ఎల్‌ఐసీ జారీ చేస్తుంది. ఎల్‌ఐసీ నుంచి లోన్ కోసం ఇతర వాటి కోసం అప్లై చేసే సమయంలో ఈ డూప్లికేట్‌ డాక్యుమెంట్‌ను మీరు చూపించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: