పాలిటిక్స్ అన్నాక ఎప్పటికీ అధికారపక్షం – ప్రతిపక్షం మధ్య మాటలు తూటాలు పేలక మానవు. అది రాజకీయాల సాంప్రదాయం. వాస్తవానికి రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ విమర్శలు, కౌంటర్లు, దెబ్బలు, దెబ్బలకు రీకౌంటర్లు అన్నీ సహజం. ఇవి లేకుండా అసలు రాజకీయాలు నడవవు అనేది సాధారణ ప్రజల అభిప్రాయం. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ట్రెండ్ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. నేటి పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నాయుడు – వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. ఒకరు “నువ్వు ఎంత” అంటే, మరొకరు “నువ్వు అంత” అన్నట్టుగా వారిద్దరూ ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ, గత తప్పులను తవ్వి బయటకు తీస్తూ, రాజకీయ పోరాటాన్ని హద్దులు దాటేలా మార్చేస్తున్నారు.దీనికి తగ్గట్టే సోషల్ మీడియాలో కూడా వారి అభిమానులు సైలెంట్‌గా ఉండటం లేదు. నాయకులు మాట్లాడితే, వెంటనే వారి అభిమానులు సోషల్ మీడియాలో ఆ మాటల్ని వైరల్ చేస్తారు. ఆ మాటలపై మీమ్స్ తయారు చేసి షేర్ చేస్తారు. ఒకరి గత తప్పులను బయటకు లాగి, మరో వర్గం మీద ట్రోల్ చేస్తారు. ఇలా సోషల్ మీడియా ఇప్పుడు రాజకీయ యుద్ధానికి కొత్త యుద్ధభూమిగా మారిపోయింది.


ఇప్పటివరకు సీఎం చంద్రబాబు నాయుడు పదవిలోకి వచ్చినప్పటి నుంచి 71 సార్లు హైదరాబాద్ వెళ్లి వచ్చాడు అన్న వార్తే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని వైసీపీ నేతలు, వైసీపీ సోషల్ మీడియా టీమ్ విపరీతంగా ఎక్కిపడుతున్నారు. చిన్న విషయాన్ని పెద్ద రాధాంతంగా చేసి, చంద్రబాబును వెటకారంగా చూపించడానికి ప్రయత్నిస్తున్నారు. నారా లోకేష్ కూడా ఎక్కువసార్లు హైదరాబాద్ వెళ్ళడం వెనుక కారణం ఏమిటో అంటూ అపోజీషన్ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. ఇది మరింత హైలైట్ అయ్యింది.



ఇక అదే సమయంలో, జగన్ కూడా ఇలాంటి విమర్శలకు గురయ్యాడన్న విషయం అందరికీ తెలిసిందే. ఇటీవల సీఎం జగన్ ప్రతి రెండు రోజులకు ఒకసారి బెంగళూరుకు వెళ్తున్నాడని, అది ఏ పనిమీద అనేది చెప్పలేకపోతున్నాడని, సోషల్ మీడియాలో ఒక వర్గం ట్రోల్స్ విపరీతంగా చేశాయి. జగన్‌పై ఆ రోజుల్లో విపక్ష మీడియా, ప్రతిపక్ష నేతలు కలిసి నిప్పులు చెరిగేలా మాటల దాడి చేశారు. ఇప్పుడు అదే తరహాలో చంద్రబాబును కూడా లక్ష్యంగా చేసుకుంటున్నారు.సోషల్ మీడియాలో ఈ రెండు విషయాలు ఒకేసారి హాట్ టాపిక్ అయ్యాయి. ఒకవైపు జగన్ బెంగళూరు వెళ్తే “అది తప్పు ” అని వ్యంగ్యంగా చెప్పేవాళ్లు, ఇప్పుడు చంద్రబాబు హైదరాబాద్ వెళ్తే “ఇది ఏ పనిమీద?” అని అదే విధంగా వెటకారంగా ట్రోల్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబు అభిమానులు కూడా సైలెంట్‌గా లేకుండా, జగన్‌పై కౌంటర్లు వేస్తున్నారు. ఇలా జగన్ వర్సెస్ చంద్రబాబు  ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో వార్ మరింత హీట్ పెంచుకుంది. రాజకీయ వర్గాల్లో, మీడియాలో, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే డిబేట్ నడుస్తోంది. పాలిటిక్స్ అంటే అంతే ఒక చిన్న ఇష్యూ కూడా ఎలా పెద్దదిగా మారిపోతుందో, ఎలా పాపులర్ ట్రెండ్‌గా మారుతుందో దీనివల్ల మరోసారి బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: