నల్లగా నిగనిగలాడుతూ, పట్టుకుంటే జారిపోయే పట్టులాంటి జుట్టు కోసం ఆడవారు తహతహ పడుతుంటారు. అందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ చిట్కాలు పాటిస్తే వారు కోరుకున్న అందమైన వెంట్రుకలు వారి సొంతమవుతాయి. ఒక కప్పు మెంతులను తీసుకోవాలి. రాత్రంతా వాటిని నానపెట్టాలి. తర్వాత రోజు ఉదయం వాటిని మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. ఆ పేస్ట్ ను తలకు పట్టించి ఒక గంట ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి అతిమధురం పొడిని పెరుగుతో కలిపి జుట్టుకు పట్టించి ఒక గంట తర్వాత నీటితో కడగేయాలి. పొనగంటాకును మెత్తగా నూరాలి. ఒక కప్పు పెరుగును దానిలో కలపాలి. ఈ మిశ్రమానికి రెండు చుక్కల నిమ్మరసాన్ని కలిపి తలకు పట్టించాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో కలపాలి. జట్టు ఒత్తుగా పెరగాలంటే మందారపూలు,కలబందగుజ్జు కలపి జుట్టుకు రాయాలి. గురివింద గింజల పొడిని ఒక రాత్రి అంతా కలబందలో నానబెట్టాలి. వాటిని సొద్దున్నే మిక్సీలో వేయాలి. ఈ పేస్ట్ కు ఒక స్పూను నేల ఉసిరిపొడిని కలిపి తలకు పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత నీటితో కడిగేయాలి. పచ్చి గోరింటాకు రసాన్ని ఒక కప్పు మెంతి పొడిలో కలిపాలి. దానికి రెండు స్పూనుల అతిమధురాన్ని కలిపి తలకు పెట్టుకోవాలి. గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేస్తే పట్టులాంటి కురులు మీ సొంతమవుతాయి
మరింత సమాచారం తెలుసుకోండి: