టాలీవుడ్  యువ నటుడు నవీన్ పోలిశెట్టి కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటించాడు. ఆ తర్వాత ఈయన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ తో హీరో గా కెరియర్ను  ప్రారంభించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత ఈయన నటించిన జాతి రత్నాలు ,  మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ లు కూడా మంచి విజయాలను అందుకున్నాయి. తాజాగా ఈయన అనగనగా ఒక రాజు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ని జనవరి 14 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈయన హీరోగా నటించిన మూడు సినిమాలు మంచి విజయాలను అందుకోవడంతో తాజాగా ఈయన నటించిన అనగనగా ఒక రాజు సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానితో ఈయన గత మూడు సినిమాలతో పోలిస్తే అనగనగా ఒక రాజు సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మరి ఇప్పటి వరకు నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన నాలుగు సినిమాల ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన మొదటి సినిమా అయినటువంటి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ మూవీ కి 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇక నవీన్ హీరోగా నటించిన జాతి రత్నాలు మూవీ కి 11 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ,  మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు 12.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తాజాగా నవీన్ నటించిన అనగనగా ఒక రాజు సినిమాకు ఏకంగా 28 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఇలా ఈయన ఆఖరి సినిమాతో పోలిస్తే అనగనగా ఒక రాజు సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. దీనితోనే ఈయన క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిందో క్లియర్ గా తెలిసిపోతుంది. ఇక ఈ సంక్రాంతికి అనేక సినిమాలో విడుదల అవుతూ ఉండడం , నవీన్ పోయిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరగడంతో ఈ మూవీ ని భారీ ధరకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు కాస్త రిస్క్ చేశారు. ఏ మాత్రం టాక్ తేడా కొట్టిన ఈ సినిమాకు నష్టాలు వచ్చే అవకాశం ఉంది అని కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. మరి ఈ సినిమాతో నవీన్ పోలిశెట్టి ఏ రేంజ్ విజయాన్ని సొంతం చేసుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: