కాళ్ల పట్టీలు నడుస్తున్నప్పుడు చేసే ధ్వని ఇంటికి ప్రత్యేక అందాన్నిస్తుంది. ఆనందాన్నిస్తుంది.! ముఖ్యంగా చిన్నపిల్లలు ఆటలప్పుడు కాళ్లకున్న మొవ్వలు పట్టీలు చక్కని శబ్దాన్ని ఇంటికి ఓ అలంకారన్నిస్తూ మైమిరిపిస్తాయి. కాళ్ళ పట్టీలు వెండి పట్టీల్లా భ్రమింపజేసే వైట్ మెటల్ రకాలు ప్రస్తుతం మార్కెట్లోకి వచ్చాయి. నమ్మకమున్న షాపుల్లో పట్టీలు కొనడం మంచిది. రోజూ తియ్యకుండా ధరించే పట్టీలు సన్నటి డిజైన్ తో వెండితో చేసినవి, మిరీ బరవైనవి కాకుండా తేలికపాటివి తీసుకోవాలి. పట్టీలును చింతపండుతో తోమితే మళ్లీ మెరుగు వస్తుంది.  నలుపు రంగు పోతుంది. బంగారు పూత పట్టీలు ప్రత్యేక సందర్భాలలో ధరిస్తే బాగుంటుంది. కొంత వయసు దాటాక, అంటే పాతికేళ్లు దాటిన తర్వాత గజ్జల పట్టీలు ధరించడం బాగుండదు. పెళ్ళిళ్లప్పడు, పేరంటాలప్పుడు, పెద్దడిజైన్ పట్టిలు పెడితే బాగుంటుంది. ఆపీస్ కి వెళ్లేటప్పుడు, మీటింగ్ ఉన్నప్పుడు పట్టీలు వాడకపోతేనే మంచిది.  రెండుకాళ్ల పట్టీలను వేర్వేరుగా పొట్లాలుగాకట్టి ఉంచితే ఇరుక్కొకుండా ఉంటాయి. సులభంగా తీసుకుని ధరించవచ్చు. రంగు కాగితంలో దాస్తే మరీ మంచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: