మనిషి అందాన్ని కొట్టొచ్చినట్టుగా చూపించేది కేవలం శిరోజాలు మాత్రమే. ముఖం అందంగా ఉన్నా సరే చర్మం ఎంత సున్నితంగా ప్రకాశవంతంగా మెరిసినా సరే తలపై శిరోజాలు కాంతివంతంగా లేకుండా జుట్టు ఊడిపోతూ ఉంటే   ఎంతటి అందం ఉన్నా సరే ఉపయోగం ఉండదు. అందుకే శిరోజాల సంరక్షణ అందంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మరి ఇలాంటి శిరోజాలని ధృడంగా, కాంతివంతంగా ఉంచుకోవాలంటే అందుకు తగ్గ పద్దతులు పాటిస్తే తప్పకుండా జుట్టు ఊడిపోకుండా కాపాడుకోవచ్చు.

 Image result for usiri for hair

ఎండబెట్టిన కొబ్బరి ముక్కలు తీసుకుని వాటిని నూనె ఆడించి ఆ నూనేని జుట్టుకు వాడుకోవడం ఉత్తమ ఫలితాలని ఇస్తుంది. తలకి కొబ్బరి నూనె పట్టాలంటే మార్కెట్ లో దొరికే ఆయిల్స్ కాకుండా ఆడించి పట్టిన నూనె వాడటం ఎంతో ఉత్తమం.  ఒక బాటిల్ లోకి కొబ్బరి నూనెని తీసుకుని అందులో ఆడించి పెట్టిన మెంతుల పిండి కలపాలి ( సుమారు పావు లీటరు కొబ్బరి నూనె అయితే అందులో రెండు చెంచాల మెంతుల పొడి సరిపోతుంది.) , అలాగే అందులో వట్టి వేళ్ళు , ఎండబెట్టి నూనెలో మరగ బెట్టిన మందార ఆకులు కూడా వేసుకోవచ్చు, అలాగే అడవి ఉసిరి ముక్కలు (ఎండబెట్టినవి), లేదా పొడి ఉన్నా సరే ఆ మిశ్రమంలో వేసి బాగా కలిపి సుమారు వారం రోజుల పాటు నిల్వ ఉంచాలి.

 Image result for natural remedies to strengthen hair roots

ఇలా నిల్వ ఉంచిన మిశ్రమాన్ని ప్రతీ రోజు క్రమం తప్పకుండా ఉదయం పూట కుదుళ్ళకి పట్టేలా రాసుకోవాలి. ఇలా నెల రోజుల పాటు చేస్తే తప్పకుకండా ఉత్తమ ఫలితాలని పొందుతారు. జుట్టు ధృడంగా మారడమే కాకుండా, తెల్ల జుట్టు వచ్చే వారికి క్రమ క్రమంగా జుట్టు నల్లబడుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: