ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి... బంగాళాదుంపని మిక్సీలో వేసి ఆ పేస్టుని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత కడిగేస్తే చర్మం మృదువుగా మారి, ఛాయ పెరుగుతుంది. చర్మంపై ఉన్న జిడ్డు కూడా తొలగిపోయి ముఖం తాజాగా మారుతుంది. బంగాళాదుంప రసానికి కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి ముఖానికి పట్టించి, పావుగంట తరువాత కడిగేస్తే చర్మం రంగు తేలుతుంది.ఒక స్పూను బంగాళాదుంప రసానికి స్పూను ముల్తానీ మట్టిని కలపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని కాసేపు ఆరనీయాలి. ముందు గోరువెచ్చటి నీటితోనూ, తరవాత చన్నీటితోనూ కడిగేయాలి. బంగాళాదుంపని ఉడకబెట్టి ముద్దలా చేసి, ఒక స్పూను పాల పొడి, ఒక స్పూను బాదం నూనె కలిపి ముఖానికి పట్టించి పావుగంట తరవాత శుభ్రపరిస్తే ఛాయ మెరుగుపడుతుంది.

ముల్తాని మట్టిలో చెంచా ఆలుగడ్డ గుజ్జు రసం, నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలపాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఆలుగడ్డను తురిమి రసం తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసి కోడిగుడ్డు, పెరుగు కలపండి. ఆ తర్వాత జుట్టు కుదుళ్ల నుంచి మొత్తం వెంటుకలకు అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి, షాంపుతో తలంటుకోండి. మీ జట్టుకు బోలెడంత బలం వస్తుంది. జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.బంగాళాదుంప రసాన్ని దూదితో ముంచి, దాన్ని కళ్లపై పావుగంట సేపు ఉంచాలి. ఇలా రోజూ చేస్తూ నల్లటి వలయాలు తగ్గుతాయి.

దాని రసంతో రోజూ ముఖాన్ని కడుక్కుంటే ముడతలు తగ్గుతాయి. ముఖంపై తెల్లటి మచ్చలు, ఎండకు కమిలిపోయిన చర్మానికి బంగాళాదుంప రసం రాస్తే చర్మం మళ్లీ మామూలు స్థితికి చేరుకుంటుంది.ఇక ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాల కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో విషయాలు తెలుసుకోండి..

మరింత సమాచారం తెలుసుకోండి: