
అలాగే రెండు స్పూన్స్ శనగపిండిలో చిటికెడు పసుపు,ఒక స్పూన్ నిమ్మరసం లేదా పెరుగు ను కలిపి పేస్ట్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి బాగా పట్టించి 20 నిముషాలు ఆరనివ్వాలి. ఆరిన తర్వాత ముఖాన్ని స్క్రబ్ చేయాలి.ఒక స్పూన్ పాలు,తేనె మరియు నిమ్మ రసం తీసుకోని మృదువుగా పేస్ట్ చేయండి. దీనిని మీ ముఖానికి,మెడకు బాగా పట్టించి 20 నిముషాలు అయిన తర్వాత నార్మల్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వారంలో రెండు-మూడు సార్లు చేస్తే,మీ చర్మం మీద అన్ని రకాల మచ్చలు తొలగిపోయి చర్మం మృదువుగా ఇంకా మారుతుంది.ఒక స్పూన్ తేనే,ఒక స్పూన్ పాల పొడి,అర స్పూన్ బాదం పొడి లేదా ఆయిల్ లను బాగా కలిపి ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేయాలి.ఇలా ఈ పద్ధతులు క్రమం తప్పకుండా పాటించండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.