ప్రస్తుత కాలంలో చాలా మంది తమ చిన్న వయసులోనే వృద్దాప్యం ఛాయల బారిన పడుతున్నారు. 30 దాట కుండానే వృద్దాప్య ఛాయలు మన శరీరంపై అల్లుకుంటాయి. చిన్న వయస్సులోనే ముసలి వాళ్ళ లాగా కనపడుతుంటారు. అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకుంటే చాలా సింపుల్ గా వృద్దాప్యం నుంచి బయటపడి సంపూర్ణ ఆరోగ్యంగా ఇంకా అలాగే అందంగా ఉండగలరు. ముఖ్యంగా కొన్ని ఆహార పదార్ధాలకు చాలా దూరంగా ఉండాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.కెఫిన్ అనే పదార్థాన్ని అధికంగా తీసుకోవడం వల్ల చర్మంలోని కణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రాసెస్ చేసిన మాంసంలో గ్రైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి. ఇవి చర్మాన్ని వృద్దాప్యం వచ్చేలా చేస్తాయి. ఈ పైన చెప్పిన వాటిని దూరం చేసి మంచి నట్స్ తింటూ వ్యాయామం చేస్తే ఫిట్ అండ్ గ్లామర్‎గా కనిపిస్తారు.షుగర్ కంటెంట్ అధికంగా ఉన్న వాటిని తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్‎ను శాతాన్ని నష్టపరిచే AGEs ఉత్పత్తి అవుతుంది. ఈ కారణంగా కూడా చర్మం యవ్వనాన్ని కోల్పోతుంది.


జంక్ ఫుడ్, చాట్ ఐటెమ్స్, పానీపూరీ లాంటివి తినడం వల్ల కూడా వృద్దాప్యం త్వరగా దరిచేరుతుంది.ఆల్కాహాల్ తీసుకోవడం వల్ల చర్మం డీహైడ్రేషన్ కు గురవుతుంది. తద్వారా చర్మం పొడిబారండం తేమ తగ్గిపోవడం జరుగుతుంది. ఇది యవ్వనాన్ని చర్మ సౌందర్యాన్ని తగ్గించేలా చేస్తుంది.అందుకే ఆల్కాహాల్ జోలికి పోకుండా ఉండటం మంచిది. ఇక కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు, పీజాలు, చీజ్, బటర్, నూనె పదార్థాలు అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. అందువల్ల చర్మం ముడతలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. అందుకే వీలైనంత లైట్ ఆయిల్ ఫుడ్స్ తీసుకుంటూ ఉండాలి. స్వీట్లు, కేకులు అంటే ఇష్టపడని వారు ఎవరు ఉండరు.ప్రతి ఒక్కరికీ ఈ ఆహారపదార్థాలు అంటే ఇష్టం ఎక్కువగా ఉంటుంది. షుగర్ కంటెంట్ బాగా ఎక్కువగా ఉన్న వాటిని తినడం వల్ల శరీరంలో కొల్లాజెన్‎ను శాతాన్ని నష్టపరిచే AGEs ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా కూడా చర్మం యవ్వనాన్ని కోల్పోతుంది. కాబట్టి ఖచ్చితంగా పైన తెలిపిన ఆహారాలకి దూరంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: