జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమై, ప్రస్తుతం బెంగళూరు జైల్లో శిక్షను అనుభవిస్తున్న శశికళకు, ఆదాయపు పన్ను శాఖ భారీ షాక్ ఇచ్చింది.ఆమెకు చెందిన రూ. 300 కోట్ల నగదుతో పాటు, 65 ఆస్తులను అటాచ్ చేసింది. అమె పలు షెల్ కంపెనీల ద్వారా బినామీ కంపెనీలను ఏర్పాటు చేసుకుని, వాటి ద్వారా కోట్ల విలువైన ఆస్తులను కూడబెట్టినట్టు ఐటీ శాఖ గుర్తించింది.