కల్వకుంట్ల కవిత తాజాగా మరో బాంబు పేల్చారు. కోకాపేటలోని ప్రణీత్ ప్రణవ్ విల్లాస్ వెంచర్ మధ్యలో ఉన్న పది ఎకరాల చెరువు ఆరు ఎకరాలకు ఎలా తగ్గిందని ప్రశ్నించారు. ఆ చెరువు పూర్తిగా కబ్జా అయిపోయిందని, అభివృద్ధి పేరుతో కేటీఆర్ హయాంలోనే చెరువునే మింగేశారని ఆమె ఆరోపించారు. ప్రణీత్ ప్రణవ్ కంపెనీల్లో మాధవరం కృష్ణారావు కుమారుడు డైరెక్టర్‌గా ఉన్నాడని, ఆ వెంచర్‌లోని విల్లాలన్నీ కబ్జా భూములపైనే కట్టారని కవిత బహిరంగంగా వెల్లడించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, హైడ్రా అధికారులకు సవాలు విసురుతూ ధైర్యం ఉంటే ఆ చెరువు సంగతి చూడండని గట్టిగా అన్నారు. ఈ ఆరోపణలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో కలకలం రేపుతున్నాయి. గతంలో ఫార్మా సిటీ, ఆర్ఆర్ఆర్ ప్రాజెక్టుల్లోనూ ఇలాంటి చెరువు ఆక్రమణలు జరిగాయని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. కవిత ఈ విషయాన్ని బయటపెట్టడం ద్వారా బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూ దోపిడీలను మరోసారి గుర్తు చేస్తున్నారు.

రాజకీయ వర్గాలు ఈ ఛాలెంజ్‌కు రేవంత్ సర్కార్ ఎలా స్పందిస్తుందో ఆసక్తిగా చూస్తున్నాయి.కోకాపేటలోని ఈ పది ఎకరాల చెరువు గతంలో జిఓ ట్యాగింగ్‌లో 10.28 ఎకరాలుగా రికార్డు ఉండగా, ఇప్పుడు ఆరు ఎకరాలకే పరిమితమైందని కవిత పత్రాలతో సహా వివరించారు. ఈ వెంచర్‌లో 140కు పైగా విల్లాలు కట్టేశారని, చెరువు ఫుల్ ట్యాంక్ లెవల్‌ను కూడా మార్చేశారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా ఇప్పటివరకు ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నిస్తూ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా ఆక్రమణలపై చర్య తీసుకుంటుందా అని సవాలు చేశారు. ఈ ఛాలెంజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రజలు హైడ్రా ఇక్కడ కూడా బుల్డోజర్ సవాలు చేస్తుందేమో చూద్దామని ఎదురుచూస్తున్నారు.


 9490520108..  వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్యలు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్రజ‌ల స‌మ‌స్యలు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్యక్తిగ‌త స‌మ‌స్యలు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: