ప్రతి సంవత్సరం సంక్రాంతి పండక్కు చాలా సినిమాలు విడుదల అవుతాయి అనే విషయం మనకు తెలిసిందే. ఈ సంవత్సరం కూడా సంక్రాంతి పండక్కు చాలా సినిమాలు విడుదల కావడానికి రెడీగా ఉన్నాయి. ఈ సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల కాబోయే సినిమాలపై చాలా మంది హీరోయిన్లు భారీ స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. ఆ సినిమాలతో మంచి విజయాలను అందుకొని తిరిగి ఫుల్ కం బ్యాక్ ఇవ్వాలి అని ఆశిస్తున్న నటీ మణులు కూడా చాలా మంది ఉన్నారు. డింపుల్ హయాతి ఇప్పటివ రకు తెలుగు లో పలు సినిమాలలో నటించిన ఈమెకు సరైన విజయం హీరోయిన్గా తెలుగు లో ఇప్పటివరకు దక్కలేదు. ఈమె ప్రస్తుతం రవితేజ హీరోగా రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఈమెకు తెలుగు లో మంచి గుర్తింపు దక్కే అవకాశం చాలా వరకు ఉంటుంది. ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపు ను సంపాదించుకున్న హీరోయిన్లలో ఒకరు అయినటువంటి పూజా హెగ్డే ఈ మధ్య కాలంలో వరుస పెట్టి అపజయాలను ఎదుర్కొంటుంది. ప్రస్తుతం ఈమె తలపతి విజయ్ హీరో గా రూపొందుతున్న జన నాయగన్ అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తుంది.

సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. ఈ సినిమా మంచి విజయం సాధిస్తే ఈమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కే అవకాశం ఉంటుంది. నటిగా అద్భుతమైన క్రేజ్ ను దక్కించుకున్న అద్భుతమైన విజయాలను అందుకోవడంలో మాత్రం శ్రీ లీల చాలా వెనకబడిపోయింది. ప్రస్తుతం ఈమె శివ కార్తికేయన్ హీరోగా రూపొందుతున్న పరాశక్తి అనే మూవీ లో హీరోయిన్గా నటిస్తుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. ఈ మూవీ మంచి విజయం సాధిస్తే శ్రీ లీల కి తమిళ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ దక్కే అవకాశం చాలా వరకు ఉంటుంది. మరి ఈ ముగ్గురు ముద్దుగుమ్మలకు ఈ సారి సంక్రాంతి పండగ ఎలా కలిసి వస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: