నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకప్పుడు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించిన వైసీపీకి 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇక్కడ షాకింగ్ ఫలితాలు ఎదురయ్యాయి. జిల్లాలో వార్ వన్ సైడ్ అనే విధంగా తెలుగుదేశం పార్టీకి అనుకూల ఫలితాలు రావడం సోషల్ మీడియా వేదికగా కూడా విస్తృత చర్చకు దారితీసింది. ఈ అనూహ్య పరాజయానికి ప్రధాన కారణాల్లో పార్టీలోని కీలక నేతలు వైదొలగడం ఒక కారణంగా చెప్పవచ్చు. ముఖ్యంగా గతంలో వైసీపీలో కీలకంగా పనిచేసిన వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంటి నాయకులు పార్టీ మారడం జిల్లాలో వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలేందుకు ఒక మైనస్ పాయింట్‌గా మారింది.
ఎన్నికల ఫలితాల అనంతరం కూడా నెల్లూరులో వైసీపీకి సవాళ్లు తప్పడం లేదు. ప్రస్తుతం నెల్లూరు నగరంలో మేయర్‌కు షాకిచ్చేలా పార్టీలోనే అసమ్మతి కార్యక్రమం మొదలవడం కలకలం రేపుతోంది. గతంలో వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి వెళ్లిన ఐదుగురు కార్పొరేటర్లను మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తిరిగి వైసీపీలోకి తీసుకొచ్చారు. అయితే వారిలో ఇద్దరు కార్పొరేటర్లు కొద్ది రోజులకే మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోవడం ఇప్పుడు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇది వైసీపీ నాయకత్వానికి ఇబ్బందికర పరిణామంగా మారింది.
నెల్లూరు జిల్లాలో వరుసగా ఎదురవుతున్న ఈ రాజకీయ సవాళ్ళను, అంతర్గత కలహాలను, నాయకుల వలసలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధిగమిస్తుంది, పార్టీ పట్టును తిరిగి ఎలా నిలబెట్టుకుంటుంది అనే అంశాలు ఇప్పుడు ఉత్కంఠగా మారాయి. క్షేత్రస్థాయిలో పార్టీకి ఎదురవుతున్న ఈ సవాళ్ళను దీటుగా ఎదుర్కొని, జిల్లాలో పూర్వ వైభవాన్ని తిరిగి సాధించడానికి వైసీపీ ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తుందో చూడాల్సి ఉంది.
కోటంరెడ్డి వర్సెస్ అనిల్ కుమార్ యాడవ్ అనే విధంగా కూడా పరిస్థితి మారిందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సవాళ్ళను అధిగమించే విషయంలో వైసీపీ ఏ విధంగా ముందుకెళ్తుందో చూడాల్సి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి