2021లో జరిగిన కార్పొరేషన్ ఎన్నికలలో వైసీపీ 54 కి 54 చోట్ల గెలిచి క్లీన్ స్వీప్ చేసింది. 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలవడంతో..11 మంది మినహా మిగిలిన కార్పొరేటర్లందరూ కూడా టిడిపిలోకి చేరారు. దీంతో 40 మంది కార్పొరేటర్లు మేయర్ స్రవంతి పైన అవిశ్వాస తీర్మానానికి సిద్ధమయ్యారు. అందుకోసం జిల్లా కలెక్టర్ కి నోటీసులను పంపించగా ఈనెల 18న అవిశ్వాస కౌన్సిలర్ సమావేశం జరగనుంది. అయితే సాఫీగా జరుగుతుందన్న సమయంలో.. అనిల్ కుమార్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి ఒక్కసారిగా టిడిపి నేతలకు టెన్షన్ పుట్టించారు.
వైసీపీ నుంచి టీడీపీ పార్టీలోకి చేరిన కార్పొరేటర్లను టిడిపిపై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకునేలా ప్లాన్ చేశారు.. 54 మంది ఉన్న కార్పొరేటర్లలో డిప్యూటీ మేయర్ గా ఉన్న ఖలీల్ కార్పొరేటర్ పదవికి రిజైన్ చేశారు. దీంతో ప్రస్తుతం 53 కి కార్పొరేటర్ల సంఖ్య పడిపోయింది.. ఇందులో 41 మంది టీడీపీకి, 12 మంది వైసీపీలో ఉన్నారు. 5 మంది కార్పొరేటర్లు వైసీపీ గూటికి జగన్ సమక్షంలో చేరిన తర్వాత అందులో తిరిగి మళ్లీ అదే రోజు సాయంత్రం ఇద్దరు కార్పొరేటర్లను టిడిపి పార్టీలో చేర్చుకున్నారు. దీంతో ప్రస్తుతం బలాలు టిడిపికి 38, వైసీపీకి 15 మంది ఉన్నారు. ఈ విషయంపై వైసీపీ నేతలు మాట్లాడుతూ కోట్ల రూపాయలు గంజాయి డబ్బులు పెట్టీ ఒక్కొక్కరిని కొంటున్నారంటూ వైసిపి వారు ఆరోపణలు చేస్తున్నారు..ఈ క్రమంలోనే టిడిపి నేతలు మంత్రి నారాయణ, కోటంరెడ్డి బ్రదర్స్ మరి కొంతమంది నేతలు అలర్ట్ అయ్యారు. దీంతో అవిశ్వాసం ముందు రోజు వరకు మిగిలిన 35 మంది టీడీపీ కార్పొరేటర్లు క్యాంపు లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈనెల 18వ తేదీన ఏం జరుగుతుందో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి