రెండు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్ల గురించి తరచూ జోరుగా చర్చ జరుగుతోంది. ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా తెలుగు రాష్ట్రాల్లో టికెట్ రేట్లు  ఉన్నాయనే కామెంట్లు ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. పెద్ద సినిమా విడుదలైతే టికెట్ రేట్లు పెంచడం సాధారణం అయింది.  టికెట్ రేట్లను అంచనాలకు మించి పెంచడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వినిపిస్తున్నాయి.  తాజాతగా కోమటిరెడ్డి చేసిన కామెంట్లు ఒకింత చర్చనీయాంశం అయ్యాయి.

కాంగ్రెస్ ది  ఇందిరమ్మ రాజ్యం అని ఇకపై తెలంగాణ రాష్ట్రంలో సినిమా టికెట్లు పెంచబోమని ఎవరూ కూడా టికెట్ రేట్ల పెంపు కోసం తమను సంప్రదించవద్దని కోరారు.  అఖండ2 విషయంలో నాకు తెలియకుండా జీవో వచ్చిందని ఇకపై పొరపాటు జరగకుండా చూసుకుంటామని చెప్పుకొచ్చారు.  హీరోల అభిమానులు సైతం కలెక్షన్ల విషయంలో రికార్డులు క్రియేట్ కావాలని ఎక్కువ మొత్తం రేటు పెట్టినా టికెట్లు కొంటున్నారు.

టికెట్ రేట్లు పెంచడం వల్ల పది సినిమాలు చూసే ప్రేక్షకులు రెండు సినిమాలకే పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది.  తెలంగాణ సర్కార్ టికెట్ రేట్ల పెంపు విషయంలో మాట మీద నిలబడుతుందో లేదో సంక్రాంతి పండుగ సమయంలో తేలిపోనుంది.  అయితే సినిమా హీరోల విషయంలో కఠినంగా వ్యవహరించడం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కు ఒకింత మైనస్ అయిందనే సంగతి తెలిసిందే.

 కోమటిరెడ్డి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల  నష్టపోయేది పార్టీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  రేవంత్ రెడ్డి సైతం గతంలో  ఇదే తరహా  ప్రకటనలు చేసి మాట మార్చారు.  ఈరోజు కూడా అఖండ2 మూవీ బుకింగ్స్ బాగున్నాయి. తెలంగాణాలో పెంచిన టికెట్ రేట్లు మాత్రమే అమలవుతున్నాయి.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: