రాష్ట్ర ప్రభుత్వం నేచురల్ గ్యాస్ మీద వ్యాట్‌ను పెంచినట్లు ప్రకటించింది. విషయం బైటకు వచ్చిన వెంటనే లోకేష్‌బాబు ట్వీట్టర్ అందుకున్నారు. ఆసరా, టోకరా.బకరా..అంటూ ప్రాస కూడా వాడి ట్వీట్ చేసారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటిగా భావించి అమలు చేస్తున్న వైఎస్సార్ ఆసరా పథకాన్ని చిన్నబుచ్చడంతోపాటు, ప్రభుత్వంపై బురద జల్లడమే ప్రధాన ధ్యేయంగా ఈ ట్వీటు సాగిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడే లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు... మహిళలు ఇళ్ళలో వాడే లిక్విడ్ పెట్రోలియంగ్యాస్ (ఎల్పీజీ) కి నేచురల్ గ్యాస్‌కు తేడా తెలియకపోతే ఎలా? లోకేష్‌బాబూ అంటూ ట్రోలింగ్ చేయడం మొదలెట్టేసారు