తాజాగా ఓ వైసీపీ ఎమ్మెల్యే ప్రతి విమర్శలు చేయడం, ప్రతి విషయానికీ స్పందించడం.. వంటివి మానుకోవాలని పార్టీ అధిష్టానం నుంచి తమకు సూచనలు అందాయని పేర్కొన్నారు.. టీడీపీ నాయకుడు, బాబు తనయుడు లోకేష్ విషయంలో ఇప్పటివరకు జరిగిపోయింది ఎలా ఉన్నప్పటికీ.. భవిష్యత్తులో మాత్రం ఆయనకు సమాధానం ఇవ్వరాదని, అనవసరంగా స్పందించి లోకేష్‌ను పెద్దనాయకుడిగా చూస్తున్నట్టు ఉందని పార్టీ అభిప్రాయపడుతున్నట్టు ఈ ఎమ్మెల్యే ఆఫ్ ది రికార్డుగా మీడియాతోనే చెప్పుకొచ్చారు. మరి లోకేష్ తనను తాను గుర్తింప పడేలా చేయడానికి ఎలాంటి ప్లాన్ వేస్తాడో చూడాలి..