నందమూరి కుటుంబంలో రాజకీయంలోకి వచ్చి ఎక్కడా స్థిరంగా లేకుండా పోయారు పురంధరేశ్వరి.. నందమూరి బాలకృష్ణ టీడీపీ లో పాతుకుపోగా మొదటినుంచి రాజకీయాల్లో ఉంటూ వస్తున్న చిన్నమ్మ ఆ పార్టీ, ఈ పార్టీ అంటూ వెళ్లి ఎక్కడా సరైన పేరు ప్రఖ్యాతలు తెచ్చుకోలేదు.. చంద్రబాబు తొవైరం వలన ఆమె కాంగ్రెస్ లో చేరి అక్కడ రాజకీయాల్లో కొన్నేళ్లు రాణించి బాగానే స్థిరపడ్డారు అనుకున్నారు.. కానీ కొద్దీ కాలంలోనే ఆమె బీజేపీ లోకి వెళ్లి కాంగ్రెస్ కు షాక్ ఇచ్చారు. అయితే బీజేపీ లో ఇప్పుడు కొత్తగా వచ్చిన రాజకీయ నాయకులతో ఆమెకు పడట్లేదనే వాదన బయటకు వస్తుంది..