ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ తో ఓ సినిమా చేస్తున్న క్రిష్ కి మనసంతా పవన్ కళ్యాణ్ సినిమాపైనే ఉందట.అతని బృందం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ కోసం షెడ్యూల్ ప్లాన్ చేస్తోందిట. ఈ చిత్రంలో హీరోయిన్లు.. ఇతర నటీనటుల గురించి చాలా ఊహాహాగానాలు వినిపించినా ఇంకా కొందరిని ఫైనల్ చేయాల్సి ఉంది. ఇక క్రిష్ కి పవన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తారు? అన్నదానికి సమాధానం వెతికితే.. పవర్ స్టార్ అక్టోబర్ 26 నుంచి వకీల్ సాబ్ చిత్రీకరణను తిరిగి ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టును నవంబర్ నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నారు. సేమ్ టైమ్ అయ్యప్పనమ్ కోషియం రీమేక్ చిత్రీకరణపైనా పవన్ ఆలోచిస్తున్నారు.