నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ పూజ హెగ్డే పాత్ర ప్రేరణ ఫస్ట్ లుక్ ని ఆమె పుట్టిన రోజు సందర్భంగా ఇటీవలే రిలీజ్ చేయగా ఆ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. తాజాగా ప్రభాస్ పుట్టినరోజు కానుకగా అడ్వాన్స్ బర్త్ డే గిఫ్ట్ వచ్చేసింది. ఈసినిమాలోని ప్రభాస్ క్యారెక్టర్ని పరిచయం చేస్తూ.. చిత్రబృందం ఓ పోస్టర్ వదిలింది. ఈ సినిమాలో ప్రభాస్ పేరు విక్రమాదిత్య. నిజానికి హీరోయిన్ పేరు రాధ, హీరో పేరు… శ్యామ్ అనుకున్నారంతా. అలా టైటిల్ జస్టిఫికేషన్ చేశారేమో అనుకున్నారు. కానీ.. విక్రమాదిత్య గా ప్రభాస్ ని పరిచయం చేసి ట్విస్ట్ ఇచ్చింది చిత్రబృందం.