ఆర్థికం క‌న్నా జీవిత‌మే గొప్ప‌ద‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ అన్నారు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి మే 3వ తేదీ వ‌ర‌కు దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ 21 రోజులు ఎన్ని క‌ష్టాలు ఎదురైనా దేశ ప్ర‌జ‌లు నిల‌బ‌డ్డార‌ని, ఇదే స్ఫూర్తిని ఇక‌ముందు కూడా చూపాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. భార‌త్‌లో క‌రోనా వైర‌స్ పూర్తి నియంత్ర‌ణ‌లో ఉంద‌ని, ఇది భార‌త ప్ర‌జ‌ల విజ‌య‌మ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ అన్నారు. దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న లాక్‌డౌన్‌పై ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ మంగ‌ళ‌వారం ఉద‌యం  10గంట‌ల‌కు దేశ ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి మాట్లాడారు.

 

క‌రోనాపై పోరుకు మ‌ద్ద‌తుగా నిలిచిన ప్ర‌జ‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దేశంలో లాక్‌డౌన్ అమ‌లుకు ప్ర‌జ‌లు పూర్తిస్థాయిలో స‌హ‌క‌రించార‌ని ఆయ‌న అన్నారు. అయితే.. ఏప్రిల్ 20వ తేదీ వ‌ర‌కు ప‌రిస్థితి మ‌రింత తీవ్రంగా ఉంటుంద‌ని ఆయ‌న అన్నారు. భార‌త్ నుంచి  క‌రోనా మ‌హ‌మ్మారిని త‌రిమికొట్టాలంటే.. మ‌రికొంత‌కాలం మ‌నంద‌రం చాలా అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న అన్నారు. ఈ లాక్‌డౌన్ పొడిగింపుతో దేశం మొత్తం 40రోజుల పాటు లాక్‌డౌన్‌లో ఉంటుంద‌న్న‌మాట‌.

మరింత సమాచారం తెలుసుకోండి: