తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది..  ఇక, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో క‌రోనా వణుకు పుట్టిస్తోంది... పాతబస్తీలో నివాసం ఉండే ఓ కుటుంబంలోని 17 మందికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. వీరిలో పది నెలల శిశువుకూడా ఉండడం ఆందోళనకు గురి చేస్తోంది.


హైదరాబాద్‌లోని తలాబ్‌కట్టకు చెందిన ఒక మహిళ ఏప్రిల్ 10న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. కరోనా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో పరీక్షలు నిర్వహించగా.. ఏప్రిల్ 13న ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.. 

 

దీంతో, అప్రమత్తమైన అధికారులు ఆ మహిళ కుటుంబ సభ్యులకు, వారితో కాంటాక్ట్‌లోకి వచ్చిన వారికి కలిపి మొత్తం 41 మందికి పరీక్షలు నిర్వ హించారు. ఇందులో 17 మందికి క‌రోనా పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. వెంట‌నే వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  మిగ తా 24 మందిని కూడా ఆస్పత్రిలోని క్వారెంటైన్‌కు తరలించారు. తెలంగాణలో ఒకే కుటుంబంలో ఇంత మందికి వైరస్ సోకడం ఇదే మొదటిసార‌ని అ ధికారులు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: