ఓవైపు క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి ప‌క‌డ్బందీ చ‌ర్య‌ల‌తో ముందుకు వెళ్తున్న ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. మ‌రోవైపు లాక్‌డౌన్ కార‌ణంగా ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బందులు ఏర్ప‌డ‌కుండా అడుగ‌డుగునా ఆదుకుంట‌న్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఏపీ తీర‌ప్రాంతానికి చెందిన సుమారు ఆరేవేల‌మంది మ‌త్స్య‌కారులు గుజ‌రాత్‌లో చిక్కుకున్నారు. వీరి క్షేమం కోసం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ స్వ‌యంగా గుజ‌రాత్ సీఎం విజ‌య్‌రూపానీతో ఫోన్లో మాట్లాడిన విష‌యం తెలిసిందే. తెలుగు మ‌త్స్య‌కారుల‌ను ఆదుకోవాల‌ని, వారికి భోజ‌నం, ఇత‌ర స‌దుపాయాలు క‌ల్పించాల‌ని కోరగా ఆయ‌న సానుకూలంగా స్పందించారు.

 

ఆ మ‌త్స్య‌కారుల‌కు ఒక్కొక్క‌రిక రూ.2వేల చొప్పున ఆర్థిక సాయం చేస్తామ‌ని తాజాగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ తెలిపారు. వారికి క‌నీస అవ‌స‌రాలు తీర్చేందుకు ఈ సాయం అందిస్తామ‌ని ఆయ‌న పేర్కొన్నారు. దీంతో మ‌త్స్యాకా కుటుంబాలు ఆనందం వ్య‌క్తం చేస్తున్నాయి. కాగా, ఏపీలో క్వారంటైన్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తున్న వారికి కూడా రూ.2వేల ఆర్థిక సాయం చేస్తున్న విష‌యం తెలిసిందే. వారు ఇంటివ‌ద్ద పౌష్టికార‌హారం తీసుకోవ‌డానికి ఈ సాయం అందిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వ‌వ‌ర్గాలు తెలిపారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: