ప్ర‌స్తుతం లాక్‌డౌన్‌లో దేశ‌వ్యాప్తంగా ఉన్న మందుబాబుల‌కు తీవ్ర క‌ష్టం వ‌చ్చింది. సాయంత్రం అయ్యేస‌రికి నోట్లో మందు చుక్క దిగందే నిద్ర‌ప‌ట్ట‌ని మందుబాబులు కోట్లాది మంది ఉన్నారు. ఇక తొలి 20 రోజులు ఈ విష‌యంలో ఓపిక ప‌ట్టిన మందు బాబులు ఎప్పుడు లాక్‌డౌన్ ఎత్తేస్తారా ?  ఎప్పుడు మ‌ళ్లీ మందు షాపులు ఓపెన్ అవుతాయా ? అని ఎన్నో ఆశ‌ల‌తో వెయిట్ చేశారు. లేకపోతే రెండు రోజులు గ్యాప్‌ ఇచ్చి మళ్లీ లాక్‌డౌన్‌ చేస్తారని అనుకున్నారు. ఈ లోపు వైన్‌షాపులు తెరిస్తే మందు పుల్‌ స్టాక్‌ పెట్టుకోవాలని చూశారు. 

 

అయితే ఇప్పుడు వీళ్ల ఆశ‌ల‌న్నీ రివ‌ర్స్ అయ్యాయి. లాక్‌డౌన్ గ్యాప్‌ లేకుండా పొడిగించడంతో మందు కోసం ఇప్పుడు వైన్‌షాపు గల్లీల చుట్టూ తిరుగుతున్నారు. కొంద‌రు అయితే ఎప్పుడు వైన్ షాపులు తెరుస్తారా ? అని క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేస్తున్నారు. హైద‌రాబాద్‌లో అయితే చాలా మంది ఉద‌యం నుంచే మందు షాపుల వ‌ద్ద క్యూ క‌డుతోన్న ప‌రిస్థితి. అయితే లాక్‌డౌన్ చాలా స్ట్రిక్ట్‌గా అమ‌లు అవుతుండ‌డంతో వీళ్ల ఆశ‌లు అడియాస‌లే అవుతున్నాయి.

 

ఇదిలా ఉంటే కొంద‌రు సీక్రెట్‌గా మందు అమ్ముతున్నారు. ఇదే అద‌నుగా బ్లాక్ మార్కెట్ ప్రోత్స‌హిస్తున్నారు. పుల్ బాటిల్‌ మూడు వేలకు తగ్గకుండా బ్లాక్‌లో అమ్మేవారు అమ్ముతున్నారు. దీంతో మందుకు ఆగలేని మందు బాబుల జేబుల‌కు భారీగా చిల్లు ప‌డుతోంది. రోజుకు వేలు ఖ‌ర్చు పెడితే గాని మందు దొర‌క‌డం లేదు. మ‌రి కొంద‌రు ఫేస్‌బుక్‌లో మందు స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇస్తూ భారీ రేట్ల‌కు అమ్మి సొమ్ము చేసుకుంటూ మందుబాబుల బ‌ల‌హీన‌త‌ల‌ను క్యాష్ చేసుకుంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: