తెలుగు, తమిళ ఇండస్ట్రీలో  హర్రర్, కామెడీ కాన్సెప్ట్ తో వచ్చిన ముని చిత్రంతో సూపర్ డూపర్ హిట్ అయ్యింది.  ఈ మూవీ మంచి హిట్ కావడంతో సీక్వెల్ గా కాంచన, కాంచన 2, కాంచన3 వరుస విజయాలు సాధించాయి.  ఈ నేపథ్యంలో కాంచన మూవీ కన్నడలో కూడా రిలీజ్ చేసి మంచి విజయం అందుకున్నారు.  తాజాగా కాంచన రిమేక్ బాలీవుడ్ లో తీస్తున్నారు.  ఈ మూవీలో బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి లారెన్స్ దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ నేటివిటీకి తగ్గట్టుగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఓ కథ నచ్చిందంటే చాలు.. దానికోసం ఎంతదూరం వెళ్లడానికైనా.. ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు అక్షయ్ కుమార్. 

 

ఆ మద్య శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన 2.0 మూవీలో విలన్ గా నటించిన విషయం తెలిసిందే.  ఈ సినిమాకు లక్ష్మీ బాంబ్ అనే పేరు ఖరారు చేసారు. బాలీవుడ్‌లో అక్షయ్ కుమార్ క్రేజ్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈయన సినిమాలు రికార్డులు తిరగరాయవు కానీ సింపుల్‌గా వచ్చి తమ పని తాను చేసుకుని వెళ్లిపోతుంటాయి. ఈ మూవీ ఆరంభంలో నిర్మాతలతో లారెన్స్ కి మనస్పర్థలు వచ్చినప్పటికీ, అక్షయ్ కుమార్ సర్దిచెప్పడంతో లారెన్స్ ఈ ప్రాజెక్టు పైనే వున్నాడు.

 

షూటింగు పార్టును పూర్తి చేసుకున్న ఈ సినిమా, విఫ్ఎక్స్ పనులను జరుపుకుంటోంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. లాక్ డౌన్ తరువాత సాధారణ పరిస్థితులు నెలకొనగానే ఈ సినిమాను థియేటర్స్ కి తీసుకురానున్నారు.   తెలుగు, తమిళంలో హిట్ అందుకున్నట్లు బాలీవుడ్ లో కూడా మంచి సక్సెెస్ అందుకుంటుందా లేదా చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: