టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా పేరు సంపాదించిన వారిలో డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా ఒకరు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో కలిసి మన శంకర వరప్రసాద్ గారు చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నయనతార హీరోయిన్గా నటించగా హీరో వెంకటేష్ కీలకమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి వరుస అప్డేట్లతో అభిమానులను ఖుషీ చేస్తున్నారు.



సినిమా విడుదలకు ఇంకా కొద్దిరోజుల సమయం ఉండడంతో (జనవరి 12-2026)  ప్రచార కార్యక్రమంలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న డైరెక్టర్ అనిల్ రావుపూడి మాట్లాడుతూ.. చిరంజీవి గారితో సినిమా చేయడం చాలా ఆనందంగా ఉందని, షూటింగ్ సమయాలలో కూడా అందరితో కలిసిపోయి నటిస్తారని తెలిపారు. అయితే చిరంజీవి ఒక్క విషయంలో ఒప్పుకోలేదని తెలిపారు..ఈ చిత్రంలో చిరంజీవి గారి సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ కోసం ప్రయత్నం చేశానని కానీ దానికి చిరంజీవి వద్దని చెప్పారని తెలిపారు.  చిరంజీవి గారు బయట ఎలా ఉన్నారో సినిమాలో అలాగే చూపించాని చెప్పారు.



ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా వస్తున్న మన శంకర వరప్రసాద్ గారు చిత్రంలో అతిథి పాత్రలో నటిస్తున్న విక్టరీ వెంకటేష్ , చిరంజీవి కాంబినేషన్లో వచ్చేసి సీన్స్ సుమారుగా 20 నిమిషాల పాటు ఉంటాయని , ఈ సీన్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయనే టాక్ వినిపిస్తోంది. చిరంజీవి సినిమాల విషయానికి వస్తే డైరెక్టర్ వశిష్ఠ తో విశ్వంభర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా సోషియో ఫాంటసీ సినిమాగా తెరకెక్కించారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 14న రిలీజ్ చేయబోతున్నారు. అలాగే డైరెక్టర్ బాబి  డైరెక్షన్లో ఒక చిత్రాన్ని చేయబోతున్నారు. మరో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో కూడా  ఒక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి.

మరింత సమాచారం తెలుసుకోండి: