దేశంలో కరోనా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ భయపెట్టిస్తుంది.  ఎంతో మంది ప్రాణాలు హరిస్తుంది. కరోనా మహమ్మారి ఏడు రోజుల పసికందును బలి తీసుకుంది. ట్విస్ట్ ఏంటంటే తల్లికి కరోనా లేకుండా బిడ్డకు వ్యాధి సోకి మరణించడం తీవ్ర కలకలం రేపింది.  హైదరాబాద్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా సోకి ఇంత తక్కువ వయసులో చనిపోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. కుత్భుల్లాపూర్‌కు చెందిన ఓ మహిళ ఇటీవల నిలోఫర్  ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చింది.

 

తర్వాత  తల్లి బిడ్డ, క్షేమంగా ఉండటంతో వారిని డిశ్చార్జీ చేశారు. ఆ తర్వాత చిన్నారి అనారోగ్యానికి గురి కావడతో పరీక్షలు జరపగా కరోనా పాజిటివ్ అని తేలింది.  దాంతో తల్లి పరిస్థితి బాగానే ఉంది.. మరి చిన్నారికి ఎలా కరోనా వచ్చిందని అందరూ ఆశ్చర్యపోయారు.  ఈ క్రమంలో  ఆస్పత్రిలోనే ఇన్ఫెక్షన్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. శిశువు ఉన్న ప్రాంతాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆ కుటుంబంతో సన్నిహితంగా ఉన్నవారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: