తెలుగు రాష్ట్రాల ప్రజలను చిరుత పులులు ఇప్పుడు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. తెలంగాణా ఆంధ్రప్రదేశ్ లో కూడా వీటి సందడి ఎక్కువైంది. లాక్ డౌన్ లో జనం బయటకు రాకపోవడంతో ఇక జనాలు లేవు అనుకున్నాయో ఏమో గాని చిరుత పులులు మాత్రం ఎక్కువగా రెండు రాష్ట్రాలలో కూడా సందడి చేస్తూ జనాలను కలవరపెడుతున్నాయి అని చెప్పవచ్చు. 

 

ఇక తాజాగా కర్నూలు జిల్లా మహానంది క్షేత్రం వద్ద చిరుత పులి కనపడింది. గోశాల సమీపంలో సంచరిస్తున్న పంది పిల్లను చిరుత నోట కరుచుకొని చెట్టు ఎక్కడం చూసిన అక్కడి వారు షాక్ అయ్యారు. అక్కడ ఉన్న పందులు గుముగూడి అరవడంతో చిరుత పంది పిల్లను వదిలేసి చెట్టు మీద నుంచి దూకి పక్కనే ఉన్న అడవి వైపు వెళ్లి చెట్ల పొదల్లో నక్కింది. మళ్ళీ వచ్చి ఆ పిల్లను లాక్కునిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: