సెప్టెంబర్ 17వ తేదీని
తెలంగాణ విమోచన దినోత్సవంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ...
అసెంబ్లీ ముట్టడికి బయల్దేరిన బిజేపి నాయకుల
అరెస్ట్ ప్రక్రియ కొనసాగుతోంది. గన్ పార్క్, నాంపల్లిలోని బంగారు మైసమ్మ దేవాలయం, బషీర్ బాగ్‌లోని నిజాం కళాశాల వద్ద
అసెంబ్లీ వైపు దూసుకువచ్చిన బిజేపి నాయకులను... పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. వారిని గోషామహల్ స్టేడియానికి తరలించారు. పోలీసులకు
బిజెపి శ్రేణులకు వాగ్వాదం జరగడంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
బంజారాహిల్స్ నుంచి
అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన రాష్ట్ర
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు
అరెస్ట్ చేశారు. ఆపై ఆయనను గోషామహాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో పోలీసులకు,
బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. బండి సంజయ్‌ను తరిలిస్తున్న పోలీసు వాహనానికి
బీజేపీ కార్యకర్తలు అడ్డంగా పడుకున్నారు. తీవ్రంగా ప్రతిఘటించిన
బీజేపీ కార్యకర్తలను పోలీసులు
అరెస్ట్ చేశారు.