రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) స్టార్ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్  నిన్న ముంబై ఇండియన్స్ పై చేసిన సెంచరీ సంచలనంగా మారింది.  తండ్రికి అనారోగ్యం కారణంగా అతను జట్టుకి  టోర్నీ ఆరంభంలో దూరంగా ఉన్నాడు. ఆ తర్వాత అతను జట్టులో చేరడం తొలి రెండు మ్యాచుల్లో ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయకపోవడంతో జట్టు ఆందోళనకు గురైంది.

అయితే నిన్న కీలక మ్యాచ్ లో అతను సెంచరీతో దుమ్ము రేపాడు. ఇక మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన తండ్రి గురించి చెప్పాడు. నా తండ్రికి ఈ సెంచరీ మంచి సంతోషాన్ని ఇస్తుంది అని ఆశాభావం వ్యక్తం చేసాడు.  ప్రస్తుతం పరిస్థితి ఇంకా  ఇబ్బందికరంగానే ఉంది అని కాని ఈ సెంచరీ కాస్త సంతోషాన్ని ఇస్తుంది అని అన్నాడు. సంజు సామ్సన్ తో కలిసి  అతను ఇన్నింగ్స్ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: