మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణా రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో జరిగిన విత్తనాల మోసం ఘటనపై అధికారులు దృష్టి సారించారు. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు పర్యటించారు. నకిలీ విత్తనాలు వలన నష్టపోయానని వ్యవసాయ అధికారులకు ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి,ఫిర్యాదు చేసారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి పొలంలో వేసినవి నకిలి విత్తనాలు కావు అన్నారు అధికారులు.

పూత,పంట రాకపోతే నకిలీ సీడ్స్ అని నిర్దారిస్తాం అని అధికారులు పేర్కొన్నారు. బీపీటీ సమానంగా ఉండాల్సింది అన్నారు. కొంత పంటలో ముందుగానే మెలకెత్తిందన్నారు. ఒకే చోట రెండు రకాల విత్తనాలు నాటారు అన్నారు. అవి రెండు కలిశాయా అనే కోణంలో కూడా పంటను పరిశీలిస్తున్నాం అని అధికారులు పేర్కొన్నారు. బాపట్ల వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు నివేదిక ఇచ్చిన తరువాత తదుపరి చర్యలు తీసుకుంటాం అని వారు వివరించారు. ఈ ఘటన సంచలనం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: