ఏపీలో జ‌రిగిన రెండో విడ‌త స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఏపీలో ప‌లువురు కీల‌క నేత‌ల‌కు సొంతూరు ప్ర‌జ‌లు షాక్ ఇచ్చారు. మంత్రి కొడాలి నాని స్వ‌గ్రామంలో టీడీపీ ఘ‌న‌విజ‌యం సాధించింది. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం యలమర్రు పంచాయతీలో టీడీపీ మద్దతు ఇచ్చిన సర్పంచ్‌ అభ్యర్థి కొల్లూరి అనూష 271 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 12 వార్డుల్లో 11 టీడీపీ మద్దతుదారులే సొంతం చేసుకున్నారు. ఆ ఒక్క వార్డు కూడా వైసీపీ కేవ‌లం ఒక్క ఓటుతో మాత్ర‌మే గెలుచుకుంది. దీంతో నానిని సోష‌ల్ మీడియాలో టీడీపీ వాళ్లు ఆడుకుంటున్నారు.

మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలం హసన్‌బాదలో వైసీపీ మద్దతుతో పోటీచేసిన అభ్యర్థి గొల్లపల్లి పార్వతి మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక కృష్ణా జిల్లాలో టీడీపీ వ్యవస్థాపక అధినేత ఎన్టీఆర్‌ స్వగ్రామంలో నిమ్మకూరులో సర్పంచ్‌ స్థానాన్ని టీడీపీ బలపరిచిన పడమట దుర్గా శ్రీనివాసరావు 121 ఓట్లతో కైవసం చేసుకున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: