తెలంగాణ‌లోని నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ప్రచారం లో ,పోలింగ్ రోజున కరోనా  వేగంగా విస్తరించించిన‌ట్టు తెలుస్తోంది. టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్ధి నోముల‌ భగత్ ‌తో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇక ఈ ప్ర‌చారంలో ముమ్మ‌రంగా పాల్గొన్న టిఆర్ఎస్ నేత ఎంసీ కోటిరెడ్డితో పాటు ప‌లువురు కాంగ్రెస్, బిజెపి నేతలకు‌ కరోనా  పాజిటివ్ వ‌చ్చింది. ఇక బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్‌కు సైతం క‌రోనా వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన వెంట‌నే ప‌లువురు అస్వ‌స్థ‌త‌కు గుర‌వుతున్నారు. వీరికి ప‌రీక్ష‌లు చేస్తోన్న కొద్ది క‌రోనా పాజిటివ్ వ‌స్తోంది.

నాగార్జునసాగర్ నియోజకవర్గం లో  భారీగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. మండలాల వారీ చూస్తే పెద్దవూర 59, హాలియా 66, గుర్రంపోడు11, నిడమనూరు7, నాగార్జునసాగర్ లో 17 కేసులుగా నమోదు అయ్యాయ‌ని.. మొత్త‌గా నిన్న 160 కేసులు నమోదు అయిన‌ట్టు చెపుతున్నా అంద‌రికి టెస్టులు చేస్తే ఈ సంఖ్య వంద‌లు దాటి వేల‌ల్లోకి వెళుతుంద‌న్న ఆందోళ‌న‌లు కూడా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఏదేమైనా ఉప ఎన్నిక దెబ్బ‌తో ఇక్క‌డ క‌రోనా శ‌ర‌వేగంగా వ్యాప్తి చెందింద‌నే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: