ప్రముఖ తమిళ హాస్యనటుడు పాండు కోవిడ్ కారణంగా గురువారం కన్నుమూశారు. ఆయన వయసు 74 సంవత్సారాలు, వారంరోజుల కిందట పాండు తోపాటు ఆయన భార్యకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దాంతో చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో గురువారం ఆయన కన్నుమూశారు. పాండు భార్య ఐసియులో చికిత్స పొందుతున్నారు. అయితే తన భర్త చనిపోయారన్న విషయం ఆమెకు తెలియదు.

పాండు 1970 లో జైశంకర్-ముత్తురామన్ నటించిన మనావన్ తో నటుడిగా తన కెరీర్ ను ప్రారంభించారు. పాండు మృతిపట్ల తమిళ సినీ పరిశ్రమ సంతాపం తెలిపింది. అఖిల భారత అన్నా ద్రవిడ మున్నేట కజగం (ఎడిఎంకె), తమిళనాడు పర్యాటక చిహ్నం ఐకానిక్ జెండాను పాండు రూపొందించారని చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: