తమ పార్టీ నాయకుడు జితిన్ ప్రసాద నిష్క్రమించి బిజెపిలో చేరడంతో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతా తిరిగి పాత ట్రిక్ లు వాడడం మొదలు పెట్టింది. ఇప్పుడు తొలగించిన ట్వీట్‌లో, ఎంపి కాంగ్రెస్ జితిన్ ప్రసాద నిష్క్రమణ పట్ల సంతోషంగా ఉందని, ఇది 'చెత్తను డస్ట్‌బిన్‌లోకి విసిరే పద్ధతి' అని ట్వీట్ చేశారు. ఆ తరువాత ట్వీట్ ను తొలగించారు. 

ఎంపీ కాంగ్రెస్ తమ నాయకులలో ఒకరు పార్టీని విడిచిపెట్టిన ప్రతిసారీ ఇలాగే ఏదో ఒక అసహ్యకరమైన ట్వీట్ రావడం ఆశ్చర్యం కలిగించదు. మార్చి 2020లో, జ్యోతిరాదిత్య సింధియా బిజెపిలో చేరడానికి పార్టీని విడిచిపెట్టి, తద్వారా కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దించినప్పుడు, ఎంపి కాంగ్రెస్ ట్విట్టర్ ఖాతా పూర్తిస్థాయిలో విరుచుకుపడింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: