
నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సంధర్భంగా ఆయనకు శుబాకాంక్షలు పెద్ద ఎత్తున వెల్లువలా వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే ఎన్టీఆర్, నారా లోకేష్, కళ్యాణ్ రామ్, చిరంజీవి, సహా చాలా మంది సెలబ్రిటీలు శుభాకాంక్షలు తెలుపగా తాజాగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనకు సోషల్ మీడియా వేదికగా విష్ చేశారు.
''హిందూపూర్ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, నటునిగా అసంఖ్యాక సినీ అభిమానులను పొందిన వెండితెర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజల ఆశీర్వాద బలం, కీర్తి సంపదల తోడుగా నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను'' అంటూ ఆయన విష్ చేశారు. ఇక బాలయ్య ప్రస్తుతం బోయపాటి డైరెక్షన్ లో అఖండ సినిమా చేస్తున్నారు.