తెలంగాణలో జూన్ 9న లాక్ డౌన్ ను సాయంత్రం 5 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకూ 10రోజుల పాటూ విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం మేరకు లాక్ డౌన్ జూన్ 19న ముగియనుంది. దాంతో ఆ తరవాత కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆసక్తి నెలకొంది. జూన్ 19 నుండి లాక్ డౌన్ సడలిస్తారా..? పొడిగిస్తరా అన్న సందేహం నెలకొంది. 
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఈనెల 19 నుండి విధించే లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారట. రాత్రి 10 గంటల నుండి మళ్లీ ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధించాలని నిర్ణయం తీసుకున్నారట. అయితే కర్ఫ్యూ ను మాత్రం ముఖ్యమంత్రి కటినంగా అమలు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: