తెలంగాణ‌లో లాక్ డౌన్ ఎత్తేయ‌డానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ జిల్లాల ప‌ర్య‌ట‌నే కార‌ణ‌మ‌ని భార‌తీయ జ‌న‌తాపార్టీ మ‌హిళా నేత విజ‌య‌శాంతి విమ‌ర్శించారు. రాష్ట్రంలో కొవిడ్ త‌గ్గిపోయింద‌ని, అన్నిప్రాంతాల్లో టీకాలు వేస్తున్నామ‌ని చెబుతూ ప్ర‌భుత్వం ప‌ర్య‌ట‌న‌లు పెట్టుకుంటోంద‌ని మండిప‌డ్డారు. తాను ద‌త్త‌త తీసుకున్న గ్రామంలో స‌హ‌పంక్తి భోజ‌నాల కోసం రాష్ట్రంలో క‌రోనా త‌గ్గిపోయింద‌నే నివేదిక‌లు తెప్పించుకొని ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తోంద‌ని ప్ర‌భుత్వంపై ధ్వ‌జ‌మెత్తారు.ఇవ‌న్నీ గ‌మ‌నించ‌కుండా ఉండ‌టానికి ప్ర‌జ‌లు అమాయ‌కులేమీ కాద‌న్నారు. పొరుగు రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తేయ‌లేద‌ని, త‌మిళ‌నాడులో మ‌రో ప‌దిరోజులు పొడిగించార‌ని, పొరుగు రాష్ట్ర‌మైన మ‌హారాష్ట్ర‌ డెల్టాప్ల‌స్ వేరియంట్‌తో భ‌య‌ప‌డుతోంద‌ని, ఏపీలో క‌ర్ఫ్యూ సాయంత్రం వేళ‌ల్లో అమ‌ల్లో ఉంద‌ని గుర్తుచేశారు. ఒక్క‌సారిగా లాక్‌డౌన్ ఎత్తేయ‌డ‌మ‌నేది ప్ర‌జ‌ల ప్రాణాల్ని ప్ర‌మాదంలోకి నెట్టిన‌ట్ల‌వుతోంద‌ని, దీనికితోడు పాఠ‌శాల‌ల‌ను కూడా ఒక‌టోతేదీ నుంచి పునఃప్రారంభించ‌డం హాస్యాస్ప‌ద‌మైన చ‌ర్య అని విజ‌య‌శాంతి అభిప్రాయ‌ప‌డ్డారు. పాల‌కులు త‌మ స్వ‌ప్ర‌యోజ‌నాల కోసం తెలంగాణ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని ప‌ణంగా పెట్టార‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

tag