టాలీవుడ్ లో మేటి సంగీత దర్శకుల్లో ఒకరైన కీరవాణి పుట్టినరోజు ఈరోజు. ఈ సందర్భంగా ప్రస్తుతం ఆయన సంగీతం అందిస్తున్న ఈ ప్రతిష్టాత్మక మూవీ "ఆర్ఆర్ఆర్" యూనిట్ నుంచి ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లడిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ అయింది. "మా మ్యూజికల్ జీనియస్ ఎమ్.ఎమ్.కీరవాణి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు అందిస్తున్న "ఆర్ ఆర్ ఆర్" సినిమా మ్యూజిక్ కోసం ప్రపంచం అంతా ఎదురు చూస్తోంది" అని పేర్కొంటూ ఈ పోస్టర్ రిలీజ్ చేశారు.


 పోస్టర్ లో కీరవాణి వయొలిన్ వాయిస్తూ కనిపిస్తున్నాడు. మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఇప్పటి వరకు ఈ సినిమా రిలీజ్ మీద అనేక సందేహాలు కొనసాగుతుండగా ఈ పోస్టర్ మీద కూడా 13 అక్టోబర్ 2021 రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించడంతో ఇవన్నీ పటాపంచలై పోయాయి. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కించిన అన్ని చిత్రాలకూ కీరవాణి సంగీతం అందిస్తారన్న విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr