సమాజంలో ట్రాన్స్ జెండర్ లు ఎంతో వివక్ష ఎదుర్కొంటున్నారన్న సంగతి తెలిసిందే. ఎవరూ ఉద్యోగాలు ఇవ్వక ఎంతోమంది ట్రాన్స్జెండర్ లు భిక్షాటన చేసుకుంటూ జీవనం గడుపుతున్నారు. కాగా తాజాగా కర్ణాటక ప్రభుత్వం ట్రాన్స్ జెండర్ ల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో వారికి 1 శాతం రిజర్వేషన్ లు కల్పిస్తున్నట్టు తెలిపింది. ఈమేరకు కర్ణాటక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది. ఇక ట్రాన్స్ జెండర్ లకు రిజర్వేషన్ కల్పించిన తొలి రాష్ట్రంగా కర్ణాటక ప్రభుత్వం నిలిచింది.

  ఉద్యోగ నియామకాలపై దాఖలైన పిటిషన్ పై కర్ణాటక హైకోర్టులో విచారణ జరిగగా ప్రభుత్వ న్యాయవాది ఈ విషయాన్ని కోర్టుకు తెలిపారు. దీని కోసం 1977 నిబంధనలను వివరించినట్లు చెప్పారు. కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాష్ట్రంలోని ట్రాన్స్జెండర్ లు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తమకు ఇచ్చిన అవకాశం తో సమాజంలో గౌరవం దక్కుతుంది అని అభిప్రాయ పడుతున్నారు. ఇక మిగతా రాష్ట్రాల్లో ఉన్న ట్రాన్స్ జెండర్ లు కూడా తమకు రిజర్వేషన్లు కల్పిస్తే బాగుండేదని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: