నాగ శౌర్య.. చిన్న హీరో గా మొదలై , టాలీవుడ్ లో స్టార్ హీరో గా ఎదిగే ప్రయత్నం చేస్తున్న నటుడు. ఇక ఈ హీరో నేడు వరుడు కావలెను అంటూ ఒక ప్రకటన చేయడం అందరిని ఆశ్చర్య పరిచింది. తాను తాజాగా నటించిన చిత్రం వరుడు కావలెను సినిమాకు గుమ్మడి కాయ కొట్టేసిన నాగ శౌర్య దర్శకురాలు లక్ష్మి సౌజన్య కు సైతం వరుడు కావాలి అంటూ ట్వీట్ చేయడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది. ఇక వరుడు కావలెను సినిమా లో హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తుండగా, మురళి శర్మ, వెన్నెల కిషోర్ వంటి నటులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. ఇక దర్శకురాలి లక్ష్మి సౌజన్య ని చెల్లి అంటూ ఆమె కి నిజంగా వరుడు కావాలి అంటూ నాగ శౌర్య తన ట్వీట్ లో తెలిపాడు. ఇక వరుడు కావలెను సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: