ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఆస్తుల విషయంలో ఇప్పుడు విపక్షాలు కోర్ట్ కి వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ ఆస్తులను అమ్మడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి విపక్షాలు. ఇక దీనికి సంబంధించి ఏపీ హైకోర్ట్ లో ప్రస్తుతం వాదనలు కూడా నడుస్తున్నాయి. మిషన్ బిల్డ్ ఏపీ పై హైకోర్టులో విచారణ జరిగింది నేడు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ప్రభుత్వ భూముల వేలం పై మధ్యంతర ఉత్తర్వులు కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది కోర్ట్.

విశాఖ, గుంటూరు లోని ప్రభుత్వ స్థలాలు, భూముల అమ్మకాలను నిలువరించాలని హైకోర్టు ను గుంటూరు కి చెందిన సామాజిక కార్యకర్త, జర్నలిస్ట్ తోట సురేష్ బాబు మరియు ఇతరులు ఆశ్రయించారు. వారి తరుపున న్యాయవాదులు  నర్రా శ్రీనివాస్, డి.ఎస్. ఎన్. వి. ప్రసాద్, నళిని కుమార్ లు వాదనలు వినిపించగా కోర్ట్ ఉత్తర్వులను కొనసాగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap