హుజూరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి ఈటెల రాజేంద్ర చేస్తున్న వ్యాఖ్యలు బాగా హైలెట్ అవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. కమలాపూర్ మండలం పెరిక ఆశీర్వాదం సభలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ నా గొంతు నొక్కేందుకు కేసీఆర్ వందల కోట్లు ఖర్చు చేస్తున్నారు అంటూ మాట్లాడారు. దసరా అందరికీ ఒకసారే ఉంటే హుజూరాబాద్ లో మాత్రం రోజు జరుగుతోంది అని అన్నారు ఆయన.

మద్యం ఏరులై పారిస్తున్నారు అని విమర్శించారు. ఓటుకు ఇరవై వేలు ఇస్తారట అంటూ ఆరోపణలు చేసారు. హుజూరాబాద్ లో మరో 20 ఏళ్ల వరకు అప్లికేషన్ పెట్టుకోకుండా అభివృద్ధి జరుగతోంది అని అన్నారు. అది నావల్లే కావడం సంతోషం అని ఆయన చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ ఎన్నికలు కేసీఆర్ అహంకారానికి హుజూరాబాద్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు అని అన్నారు ఆయన.

మరింత సమాచారం తెలుసుకోండి:

ts