మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విషయంలో దాదాపు నాలుగు నెలల నుంచి సిబిఐ అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టారు. ఈ నాలుగు నెలల కాలంలో ఎందరో అనుమైతులను విచారించడమే కాకుండా పత్రికా ప్రకటనలు కూడా విడుదల చేసారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆ పత్రికా ప్రకటన బాగానే వైరల్ అవుతుంది. ఇక వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో 112 వ రోజు కొనసాగుతున్న  సిబిఐ విచారణలో మరికొందరిని విచారించే అవకాశం ఉందని అంటున్నారు.

కడప సెంట్రల్ జైలు కేంద్రంగా  సిబిఐ విచారణ ప్రస్తుతం జరుగుతుంది. నేడుస్ వివేకానంద రెడ్డి హత్యకేసు విషయంలో  సిబిఐ విచారణకు హాజరైన వేముల జడ్పీటిసీ బయపురెడ్డి నుంచి పలు కీలక విషయాలు సేకరించారని సమాచారం. బయపురెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి కి అనుచరుడుగా తెలుస్తుంది. మరికొంత మంది అనుమానితులను విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: