అక్టోబర్ 1వ తారీఖున రిలీజ్ అయిన సాయి ధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకుంది. పలువురు ప్రముఖులు ఈ సినిమాపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా టిడిపి యువనేత నారా లోకేష్ రిపబ్లిక్ ఆసక్తికరమైన కామెంట్స్ చేసాడు. రిపబ్లిక్ సినిమా గురించి మంచి రివ్యూ లు వింటున్నాను త్వరలోనే ఈ సినిమాను చూడబోతున్నాం అని కామెంట్ చేశాడు. సాయి ధరంతేజ్ యాక్సిడెంట్ గాయాల నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అని ట్వీట్ చేశాడు. 


అయితే లోకేష్ చేసిన ఈ కామెంట్ తెలుగుదేశం వర్గాల్లో , జనసేన వర్గాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. ఇదిలా ఉండగా రిపబ్లిక్ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వైసిపి వర్గాలు, జనసేన వర్గాల మధ్య పరస్పర మాటల యుద్ధం జరిగింది . అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను టిడిపి సమర్థించింది. అయితే తాజాగా నారా లోకేష్ చేసిన ఈ కామెంట్స్ టిడిపి, జనసేన వర్గాలు సమీప ఎన్నికల్లో పరస్పర సహకారం అందించుకోబోతున్నాయని చెప్పకనే చెబుతున్నాయి


మరింత సమాచారం తెలుసుకోండి: